హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో సీఈసీ దిష్టిబొమ్మ దహనం

KNR: కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అర్హుల ఓట్లు తొలగిస్తున్నారని జిల్లా కార్యదర్శులు గజ్జెల శ్రీకాంత్, నరేష్ పటేల్ ఆరోపించారు. ఉద్యమం కొనసాగిస్తామన్నారు. బెంగాల్‌లో 37 లక్షల ఓట్లు తొలగించారన్నారు.