హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

NLG: నకిరేకల్ పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో తిప్పర్తి రోడ్డుపై ఉన్న వస్త్ర దుకాణంలో ఈరోజు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణంలోని వారు సురక్షితంగా బయటపడగా, వస్త్రాలు కాలిపోవడంతో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం.