హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 15వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. తమిళనాడు తీరంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య ఒడిశాలోనూ మరో ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.