హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రణాళికాబద్ధమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ

SRPT: కేసుల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేసి, చార్జిషీట్లు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆదేశించారు. డిజిటల్ సాక్ష్యాల సేకరణ, ఈ-సాక్ష్య పోర్టల్ వినియోగం, పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలని, నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.