హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ క్రీడాకారులకు క్రికెట్ కిట్ల పంపిణీ

WNP: కొత్తకోట మండలం నాంచారమ్మపేట గ్రామ యువకులు కోరిన మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలో ఉర్సు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ యువ క్రీడాకారులకు కిట్లు అందజేశారు. యువత క్రీడల్లో రాణించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. క్రికెట్ కిట్లు అందుకున్న యువకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.