SRPT: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని హుజూర్‌నగర్ ఎస్ఐ నరేష్ సూచించారు. ఈ రోజు సీనియర్ సిటిజన్‌లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గంజాయి విక్రయాలపై నిఘా కొనసాగుతోందన్నారు. పాత సెల్‌ఫోన్‌లను అపరిచితులకు విక్రయించవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి: ఎస్ఐ


