హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రాజన్న సిరిసిల్ల బాలికల జట్టు

SRCL: జిల్లా బాలికల కబడ్డీ జట్టు రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో పాల్గొనేందుకు అశ్వారావుపేటకు పయనమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజులపాటు జరిగే టోర్నీకి వెళ్లే క్రీడాకారిణులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డ్రెస్ కోడ్ అందజేశారు. పోటీల్లో ప్రతిభ చాటి ప్రథమ స్థానం సాధించాలని ఆకాంక్షించారు.