GNTR: తెనాలి చెంచుపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్ పంప్స్ సూపర్వైజర్ సత్యనారాయణ మృతి చెందాడు. మధ్యాహ్నం కార్మికుడు సేతుబాబుతో కలిసి భోజనానికి బైక్ పై వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ తీయడంతో ఇద్దరూ పడిపోయారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన లారీ సత్యనారాయణపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. సూపర్వైజర్ మృతి


