హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 20 కుటుంబాలు చేరిక

NDL: రుద్రవరం మండలం తువ్వపల్లె గ్రామంలో శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాల వారు చేరారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.