హైదరాబాద్: 28°C
వార్తలు

టెన్షన్.. టెన్షన్.. పోలీసులపై రాళ్ల దాడి

ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.