హైదరాబాద్: 28°C
వార్తలు

‘బారికేడ్లతో ఈసీపై నమ్మకాన్ని పెంచలేరు’

ప్రభుత్వం ఎన్నికల పారదర్శకతపై నమ్మకంతో ఉంటే ప్రజల ప్రశ్నలకు భయపడకూడదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. రాజధానిని కోటలా మార్చి ఆందోళనలను అణచివేస్తుంటే అనుమానాలు మరింత పెరుగుతాయన్నారు. బారికేడ్లు, లాఠీలతో ఈసీపై ప్రజలకు నమ్మకం తీసుకురాలేరన్నారు. నిరసనకారులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని, అరెస్ట్ చేసిన యువతను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.