హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

WGL: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకాంక్షించారు. శనివారం ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూజించే ఈ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, సంతోషాన్ని నింపాలని కోరుకున్నారు.