ADB: ఈ నెల 12వ తేదీన రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు నార్నూర్ ఎంపీడీఓ పుల్లారావు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో 'ఎల్-నినో' ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులు, వాటి దుష్ప్రభావాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారన్నారు. నార్నూర్, మహాగావ్, తాడిహత్నూర్ రైతువేదికలలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ
12న రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్


