హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి

WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.10 కోట్లతో ప్రారంభించిన పనులు సగంలోనే నిలిచిపోయాయని తెలిపారు. కోనేరు, శివాలయం, మాడ వీధులు, ఫంక్షన్ హాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.