WGL: పర్వతగిరి మండలం అన్నారంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం గ్రామపంచాయతీ నిధులతో నూతనంగా నిర్మించిన బతుకమ్మ విగ్రహాలను గ్రామ సర్పంచ్ గాడిపల్లి మహేందర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ గొడుగు ఏకాంత,పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన బతుకమ్మ విగ్రహాలను ప్రారంభించిన సర్పంచ్


