హైదరాబాద్: 28°C
వార్తలు

'తిరుమలలోని ప్రతీ అణువూ శ్రీవారికే చెందుతుంది'

AP: తిరుమలలోని మైసూరు సత్రాలను టూరిజానికి బదలాయించే కర్ణాటక కేబినెట్ నిర్ణయాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమలలోని ప్రతీ అణువూ శ్రీవారికే చెందుతుందన్నారు. కర్ణాటక ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆస్తులన్నీ టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మారిస్తే సహించేది లేదన్నారు.