హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కమిటీలో గూడూరు శివరాం ప్రసాద్

BPT: జనసేన ఎన్నికల నిర్వహణ కో-ఆర్డినేషన్ కమిటీలో స్థానం కల్పించడంపై జనసేన పార్టీ నాయకుడు గూడూరు శివరాం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎన్నికల సమన్వయానికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.