హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఆసుపత్రులకు విరాళంగా ఔషధాలు

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తుల వైద్య అవసరాల కోసం TTD ఆసుపత్రులకు రూ.18 లక్షల విలువైన ఔషధాలు విరాళంగా అందించారు. HYDకు చెందిన ఎస్ఎస్‌కే ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొప్రైటర్ జి. శ్రవణ్ కుమార్ రూ.15 లక్షలు, ఇందు డ్రగ్స్ అధినేత తలశిల వెంకటేశ్వరరావు రూ.3 లక్షల విలువైన మందులు అందించారు. దాతల తరఫున బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు TTD ఛైర్మన్ B.R నాయుడుకు ఔషధాలను అందజేశారు.