హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్

ఢిల్లీలో సీజేపీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ స్కెచ్ వేశారు. నిరసనల్లో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్‌ను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయన రాకపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్ట్ వద్ద భారీగా మోహరించి, విమానం దిగగానే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.