SRCL: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని చెరువులో మునిగి మోతే కిరణ్ అనే యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మోతే ఎల్లయ్య, ఎల్లవ్వ దంపతుల కుమారుడైన కిరణ్ స్నేహితులతో కలిసి చేపలు, తాబేళ్లు పట్టేందుకు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీటిలో మునిగిపోయాడు.
తెలంగాణ
చెరువులో మునిగి యువకుడు మృతి


