AKP: రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ లోసింగి కొండశిఖర గ్రామాల గిరిజనులు రోడ్డు కోసం శనివారం గోసీలు ధరించి అర్ధనగ్నంగా పాదయాత్ర చేశారు. అటవీ తల్లి బాట పథకంలో తవ్వి వదిలేసిన రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వేడుకున్నారు. దారి లేక గర్భిణులు మార్గమధ్యలోనే ప్రసవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు కోసం గిరిజనుల అర్ధనగ్న పాదయాత్ర


