హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 188 టీఎంసీల నీటి నిల్వ

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 13,970 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుత నీటిమట్టం 540 అడుగులకు చేరగా, నీటి నిల్వ 188.32 టీఎంసీలుగా ఉంది. విద్యుదుత్పత్తి, ఎస్సెల్బీసీ, వరద కాలువలకు 9,162 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదలను నిలిపివేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు ఈరోజు తెలిపారు.