హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్తల్లో శింగనమల ప్రాంతం

ATP: అనంతపురం జిల్లాలోని శింగనమల ప్రాంతం ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం 'రణబాలి' ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కథ రాయలసీమలోని 1876 నాటి కరవు, బ్రిటీష్ పాలనపై తిరుగుబాటు నేపథ్యంతో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సినిమాలో హీరో పాత్ర పేరు 'శింగనమల బొబ్బిలి రణబాలి' కావడం విశేషం.