హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంప్రదాయబద్ధంగా పెత్రమాస పూజలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెత్రమాస సందర్భంగా శనివారం పితృదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిసిల్ల సహా పలు ప్రాంతాల్లో గోత్రనామాలతో పూర్వీకులను స్మరించుకుంటూ సంప్రదాయ ఆచారాలు పాటించారు. పితృదేవతల ఆశీస్సులు కలగాలని బ్రాహ్మణులకు బియ్యం దానం చేసి, పలువురు భక్తులు దానధర్మాలు నిర్వహించారు.