నెల్లూరు: కావలి పట్టణంలోని పుల్లారెడ్డి నగర్ బోర్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి నుంచి నెల్లూరు వెళ్తున్న నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు, శాంతినగర్ వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ డోజర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కావలిలో రోడ్డు ప్రమాదం.. మహిళలు గాయాలు!


