హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాలయ అమావాస్య.. శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనేశ్వర స్వామి వారి ఆలయంలో మహాలయ అమావాస్య, శనివారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం చేసిన భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను ఈఓ దారపురెడ్డి సురేష్ బాబు పర్యవేక్షించారు.