హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.6 లక్షల విలువైన గొలుసు చోరీ!

TPT: రామచంద్రాపురం మండలం సొరకాయలపాలెంలో రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కే.అమరావతి రాత్రి ఇంటిలో దీపం పెట్టి ఇంటి ముందు కూర్చుని ఉండగా పొలంలో దాక్కుని ఉన్న ఇద్దరు దుండగులు ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. చోరీకి గురైన గొలుసు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది.