హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞం'

VSP: సింహాచల దేవస్థానం రాజగోపురం ప్రాంగణంలో ఆదివారం ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు 108 రౌండ్ల సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించనున్నట్లు ఈవో జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. ఓమ్ ఫ్రీ యోగా సెంటర్ సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా సాధకులు పాల్గొననున్నారు. భక్తులు, యోగా అభిమానులు తెల్లటి టీషర్ట్, నల్లటి ప్యాంటుతో హాజరుకావాలని ఆయన కోరారు.