హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షణ గోడలు లేక ప్రమాదకరంగా పారిగాం వంతెన

ASF: సిర్పూర్ (టీ) మండలం పారిగాం వంతెనపై గుంతలు ఏర్పడటంతో పాటు రక్షణ గోడలు లేక ప్రమాదకరంగా మారింది. దీంతో రాకపోకల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేయడంతో పాటు రక్షణ గోడలు నిర్మించాలన్నారు.