NLG: డిండి మండల పరిధిలోని కందుకూరులో తాగునీటి ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సిమెంట్ పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడటంతో ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా మారిన ట్యాంకును తొలగించి, మరోచోట నూతన ట్యాంకు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో తాగునీటి ట్యాంకు.. భయాందోళనలో గ్రామస్థులు


