హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తపోవనం జాతీయ రహదారిపై కారులో మంటలు

ATP: అనంతపురం తపోవనం జాతీయ రహదారిపై సర్వీసింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎంజీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యజమాని దాదు అప్రమత్తమై వెంటనే కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు సగానికి పైగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.