హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రహదారిపై విరిగిన రక్షణ జాలీలు

KNR: మానకొండూర్ మండలంలోని శంషాబాద్ సమీపంలో 563వ నంబర్ జాతీయ రహదారిపై రక్షణ జాలీలు విరిగిపోయాయి. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అవి ధ్వంసమయ్యాయి. మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. వెంటనే రక్షణ జాలీలను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.