హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాడుబడిన బావితో ప్రమాదం.. దుర్వాసనతో ఇబ్బందులు

SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామం మూడో వార్డులో ఇళ్ల మధ్య పాడుబడిన వ్యవసాయ బావి ప్రమాదకరంగా మారింది. వర్షాలకు బావిలో నీరు చేరి, చెత్త వ్యర్థాలు వేయడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న సీసీ రోడ్డుపై వెళ్లేవారు బావిలో పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.