హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెదిరించి పర్సు లాక్కున్న యువకుడి అరెస్ట్

JGL: చంపుతానని బెదిరించి రూ.3 వేల నగదు ఉన్న పర్సును లాక్కెళ్లిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మేడిపల్లికి చెందిన రాజేశ్‌ను ఈ నెల 7న అదే గ్రామానికి చెందిన ఏనుగు కృష్ణవంశీ అడ్డగించి పర్సు తీసుకొని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, అమ్మక్కపేట బస్టాండ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.