హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యలంక బీచ్‌లో ఇద్దరు గల్లంతు

BPT: సూర్యలంక బీచ్‌లో శనివారం ఉదయం సముద్ర అలల తాకిడికి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అలల్లో చిక్కుకున్న మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. వారిలో ఒకరు అపస్మారక స్థితికి చేరడంతో స్థానికులు సీపీఆర్‌ చేశారు. అంబులెన్స్‌ అందుబాటులో లేక బాధితుడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. బీచ్‌లో భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంచాలని పర్యాటకులు కోరుతున్నారు.