VKB: దసరా సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లేవారు ఇళ్ల భద్రతపై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బంట్వారం ఎస్సై విమల సూచించారు. తలుపులు, కిటికీలు పటిష్ఠంగా మూసివేయాలని, ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టవద్దని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రయాణాల్లో రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై


