హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా శ్రీ స్వామివారి నిత్యకల్యాణం

BDK: భద్రాచలం మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి నామస్మరణలు, భక్తుల ప్రార్థనల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.