హైదరాబాద్: 28°C
వార్తలు

అప్పట్లో ఉత్తరాలు.. ఇప్పుడు డిజిటల్ సేవలు!

దేశవ్యాప్తంగా తపాలా శాఖ అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఏటా ఈరోజును(OCT 10న) 'జాతీయ తపాలా దినోత్సవం'గా జరుపుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్ ఉన్న దేశం మనదే కావడం గర్వకారణం. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు కాలానుగుణంగా ఆధునికీకరించబడ్డాయి. బ్యాంకింగ్, బీమా, ఆధార్, ఈ-కామర్స్ సేవలతో ప్రజల మన్ననలు పొందుతున్నాయి.