కర్నూల్ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 క్రికెట్ పోటీల్లో పత్తికొండ విద్యార్థిని అమృత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ నెల 30న కృష్ణా జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అమృత పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర క్రికెట్ పోటీలకు పత్తికొండ విద్యార్థిని


