హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంటల్లో ఆగని అక్రమ మట్టి దందా

KNR: శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామ శివారులోని చీకటోని కుంటలో అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు పట్టపగలే యంత్రాలతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నారు.