హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ

NLG: దసరా పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ రోజు ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు సూచించారు. డీజేలకు అనుమతి లేదని పేర్కొంటూ, భద్రత నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పండుగను ఆనందంగా, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.