హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు తాజా అప్‌డేట్

WNP: జూరాల ప్రాజెక్టుకు పది రోజులుగా వరద ప్రవాహం నిలిచిపోయిందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం 3.975 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. ఎడమ కాలువకు 1,300, కుడి కాలువకు 730 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 317.52 మీటర్లుగా ఉందని, అవుట్‌ప్లో లేదని తెలిపారు.