హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర పరిధిలోని 120 వార్డులు.. 18.40 లక్షల మంది ఓటర్లు

విశాఖపట్నం నగర పరిధిలోని 120 వార్డుల్లో జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల కోసం 1,990 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 18.40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా,ఎన్నికల విధుల కోసం 14,328 మంది సిబ్బందిని నియమించనున్నారు. విశాఖ నగరపాలక సంస్థకు తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.