హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం

WGL: భద్రకాళి అమ్మవారి ఆలయంలో శనివారం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేషాభిషేకాలు నిర్వహించి దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.