హైదరాబాద్: 28°C
తెలంగాణ

హన్వాడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

MBNR: హన్వాడలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి శుక్రవారం డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.