హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీళ్లు అడిగి గోల్డ్ చైన్ కొట్టేశాడు..!

ప్రకాశం: పామూరు పట్టణంలో శుక్రవారం చోరీ జరిగింది. స్థానిక శ్రీనివాస్ నగర్‌లో గుర్రం నాగమ్మ నివాసం ఉంటున్నారు. సాయంత్రం 4గంటల సమయంలో 25ఏళ్ల యువకుడు వచ్చి తాగడానికి నీళ్లు కావాలని అడిగాడు. ఆమె ఇంట్లో నుంచి తీసుకుని వస్తుండగా మెడలోని గోల్డ్ చైన్ లాక్కొని వెళ్లాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అనూక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.