హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్: SE

BHPL: భూపాలపల్లి రూరల్ సెక్షన్ పరిధిలోని వజినపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం రాత్రి SE సదానందం ప్రారంభించారు. దీంతో ఇప్పటికే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడ్ తగ్గి విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈలు పాపిరెడ్డి, జగదీశ్, ఏడీఈలు సందీప్, మధుసూధన్ పాల్గొన్నారు.