హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్లుడిపై మామ దాడి.. కేసు నమోదు

HNK: ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన శ్రీశైలంపై ఆయన మామ ఎస్. రాజ్‌కుమార్‌ దాడి చేసినట్లు ఏఎస్సై శంకర్‌ తెలిపారు. ఆరు నెలల క్రితం రాజ్‌కుమార్‌ కుమార్తెను శ్రీశైలం వివాహం చేసుకున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో దాడి చేసినట్లు శ్రీశైలం ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.