KRNL: కర్నూల్ నగరంలోని మునగాలపాడు 15 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 12న తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఆదిత్యనగర్, రేణుకనగర్, బీసీ కాలనీ, సోమిశెట్టి కాలనీ, విష్ణు టౌన్‌షిప్‌తో పాటు పలు ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని కమిషనర్ చల్లా ఓబులేసు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని కమిషనర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూల్‌లో నీటి సరఫరా నిలిపివేత


