PDPL: పాలకుర్తి మండలం వేంనూర్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు ప్రకటించారు. తహశీల్దార్ సునీత, ఎంపీడీవో చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. సర్పంచ్ కోల లత, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ విజేతలకు బహుమతుల అందజేత


